Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:15 PM

గ్రామాల్లో నీటి కొరత లేకుండా చూడాలి… అధికారులకు స్పష్టం

09-04-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలో విద్యుత్ శాఖ మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో శాసనసభ్యుడు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించాడు. మండలంలోని గ్రామాల్లో ఉన్న విద్యుత్ సమస్యలు, తాగునీటి ఇబ్బందులపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించాడు.ఎండకాలం నేపథ్యంలో ఏ గ్రామంలోనూ తాగునీటి కొరత రాకుండా చూడాలని, పైపులైన్ లీకేజీలను వెంటనే సరిచేయాలని, అవసరమైతే కొత్త బోర్లు త్రవ్వించి లేదా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ఆదేశించాడు. విద్యుత్ కోతలు లేకుండా నిరంతర సరఫరా కల్పించాలని, వ్యవసాయం మరియు గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించాలని స్పష్టం చేశాడు. ఎక్కడైనా లూజ్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని తెలిపాడు.ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణ స్పందన ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి సకాలంలో పరిష్కారం చూపాలని అధికారులకు సూచించాడు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో నిర్లక్ష్యం చేయవద్దని పేర్కొన్నాడు.ఈ సమావేశంలో విద్యుత్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామాల్లో నీటి కొరత లేకుండా చూడాలి… అధికారులకు స్పష్టం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News