Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:46 AM

గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యం

28-01-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వేసవికి ముందే ప్రత్యేక నీటి సరఫరా డ్రైవ్‌ – జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

స్థానికం ప్రతినిధి

గ్రామాల్లో ప్రజలకు నిరంతరం సురక్షిత తాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యంగా ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై వరకు ప్రత్యేక నీటి సరఫరాడ్రైవ్ చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్లో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, మిషన్ భగీరథ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా గ్రామాల వారీగా బోర్లు, హ్యాండ్‌పంపులు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైప్‌లైన్లను పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని సూచించారు. పనిచేయని మోటార్లు, లీకేజీలు, బ్రేక్‌డౌన్లను వెంటనే గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలన్నారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరచి క్లోరినేషన్ తప్పనిసరిగా చేయాలని, ట్యాంకుల చుట్టూ పరిశుభ్రత పాటించాలని తెలిపారు. అవసరమైన చోట అదనపు బోర్లు, ప్రత్యామ్నాయ నీటి వనరులు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

జల సేవల ఆకలనం ద్వారా ప్రజలకు అందుతున్న తాగునీటి సరఫరా పరిమాణం, నాణ్యత, నిరంతరతను పరిశీలించాలని తెలిపారు. గ్రామస్థాయిలో నీటి సరఫరా లోపాలు, అవసరాలను గుర్తించేందుకు విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీలను చురుకుగా పనిచేయించాలన్నారు. గుర్తించిన అంశాలను సంబంధిత డాష్‌బోర్డ్‌లో నమోదు చేయాలని సూచించారు.అంగన్వాడి భవనాల నిర్మాణానికి నిధులు రాని వివరాలను సమర్పించాలని, వన మహోత్సవం కార్యక్రమంలో లక్ష్యాన్ని చేరుకునేలా శాఖల వారీగా నాట్లు వేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు వ్యక్తిగత మరుగుదొడ్ల మంజూరు, కమ్యూనిటీ శానిటేషన్ పనులు, సామాజిక తనిఖీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలకు మంజూరైన భవనాల ప్రతిపాదనలు వెంటనే పంపించాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కే సీతారామారావు, జడ్పీ సీఈవో శిరీష, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, ఎంపిడిఓలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News