Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:48 PM

గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం – జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

02-03-2026 114 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచుల పాత్ర ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు.కొత్తగా ఎన్నికైన సర్పంచులు బాధ్యతతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.జిల్లా కేంద్రంలోని మహిళా ప్రాంగణంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణా కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ శిక్షణలో నాలుగు మండలాలకు చెందిన సర్పంచులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణలో బోధించే అంశాలను పూర్తిగా గ్రహించి, గ్రామాల అభివృద్ధికి ఉపయోగించుకోవాలని సూచించారు. గ్రామంలో చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమం చట్టపరమైన నిబంధనల ప్రకారం అమలు చేయాలని తెలిపారు.గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించడం, వాటికి సరైన పరిష్కారాలు కనుగొనడం,అందుబాటులో ఉన్న నిధులను సక్రమంగా వినియోగించడం వంటి విషయాలపై ఈ శిక్షణ ద్వారా అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు.ప్రజలకు పారదర్శకమైన మరియు సమర్థవంతమైన పాలన అందించడం సర్పంచుల ప్రధాన బాధ్యత అని తెలిపారు.నిధులను ప్రాధాన్యత క్రమంలో వినియోగించి పనులను పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను మార్చి 31లోపు పూర్తిచేయాలని ఆదేశించారు.ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి సరఫరా సక్రమంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కారానికి కృషి చేయాలని సర్పంచులకు సూచించారు. ప్రజలతో మమేకమై బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శిక్షణకు సంబంధించిన పుస్తకాలు మరియు అవసరమైన సామగ్రిని సర్పంచులకు అందజేశారు.కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, శిక్షకులు, మహిళా సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి మరియు ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం – జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News