Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:50 PM

గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజా పాలన

గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజా పాలన

గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజా పాలన
10-03-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజా పాలన

గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజా పాలన కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య అన్నారు. మండల పరిధిలోని గణపవరం గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య ప్రజా పాలన కార్యక్రమానికి ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్, ఎంపీఓ రాంబాబుని గ్రామానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అధికారులతో కలిసి గ్రామంలో ఉన్న పలు ముఖ్యమైన పనులను పరిశీలించారు. త్వరలో జరగనున్న శ్రీ వర వర రంగనాయక స్వామి వారి కళ్యాణం మహోత్సవ కార్యక్రమానికి కావలసిన వాటర్ ఫెసిలిటీ,రవాణా సౌకర్యాలు, శాంతి భద్రతలు, హెల్త్ క్యాంప్, గురించి అధికారులను అభ్యర్ధించడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్న నర్సరీ, హైస్కూల్, ప్రైమరీ స్కూల్‌ను సందర్శించి అక్కడి బోధనా విధానం 10వ తరగతి విద్యార్థుల పరీక్షల సిద్ధత గురించి టీచర్లను అడిగి తెలుసుకుని తగిన సూచనలు చేశారు. అలాగే విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని కూడా పరిశీలించారు. గ్రామంలోని వెటర్నరీ ఆసుపత్రి నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి అక్కడి సేవల పరిస్థితిని తెలుసుకున్నారు. మహిళల సాధికారత కోసం గ్రామంలో ఎస్ హెచ్ జి పొదుపు సంఘాల మహిళల కోసం నిర్మించబడుతున్న మీటింగ్ హాల్ పనుల గురించి సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య గారు అధికారులకు వివరించారు.

తదుపరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గ్రామంలో ఉన్న వివిధ సమస్యలు, అభివృద్ధి అవసరాలు, ప్రజల అవసరాల గురించి సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య అధికారులకు సమగ్రంగా వివరించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం గణపవరం గ్రామ పంచాయతీ నిరంతరం కృషి చేస్తోంది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి జీవిత రెడ్డి, ఏఎన్ఎం విజయలక్ష్మీ, జిపిఓ అన్నపూర్ణ, 9వ వార్డు మెంబర్ బండి చిన కోటయ్య, కాసాని శ్రీను, పోశం శ్రీను, కొండ ధనమూర్తి, బలుగూరి నాగస్వరప్, ఇర్ల నర్సిరెడ్డి, శ్యామకురి గురవయ్య, జంగం గాంధీ, అమరబోయిన లక్ష్మయ్య, పోశం కృష్ణయ్య, శెట్టి అప్పారావు,పిడమర్తి పుల్లయ్య గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజా పాలన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News