Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:02 PM

గణపవరంలో సమభావన సంఘాల మీటింగ్ హాల్‌కు శంకుస్థాపన

22-02-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మహిళలు స్వయం సహాయక సంఘాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య సూచించారు. మండల పరిధిలోని గణపవరం గ్రామంలో ఆదివారం సమభావన సంఘాల మీటింగ్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని స్వచ్ఛందంగా దానం చేసిన దాతల కుటుంబ సభ్యులు సీతారాం రెడ్డి, అప్పిరెడ్డికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దాతల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని పేర్కొన్నారు.

నిర్మించబడనున్న మీటింగ్ హాల్ మహిళా పొదుపు సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, గ్రామాభివృద్ధి చర్యలకు ఉపయోగపడుతుందని చెప్పారు. గ్రామ ప్రజల సహకారంతో గణపవరం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా గ్రామానికి అందాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సభలో పిలుపునిచ్చారు.

Sthanikam

గణపవరంలో సమభావన సంఘాల మీటింగ్ హాల్‌కు శంకుస్థాపన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News