Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:33 AM

గాల్వన్ అమర వీరుడు కల్నాల్ సంతోష్ బాబు తల్లికి తెలంగాణ విద్యార్థి, యువజన సంఘం మద్దతు

06-02-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

గాల్వన్ లోయలో దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర వీరుడు కల్నాల్ సంతోష్ బాబు తల్లి బిక్కుమాళ్ల మంజులుకు తెలంగాణ విద్యార్థి, యువజన సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 44వ వార్డులో భారత రాష్ట్ర సమితి పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థిగా బిక్కుమాళ్ల మంజుల ఎన్నికల బరిలో నిలిచిన నేపథ్యంలో, ఆమెకు రాజకీయ పార్టీలకు అతీతంగా మద్దతు తెలపాలని కోరుతూ సంఘం నాయకులు స్థానిక గాంధీ విగ్రహం వద్ద కరపత్రాన్ని ఆవిష్కరించి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి, యువజన సంఘం నాయకులు భాషిపంగు సునీల్, పంతం యాకయ్య, చామకూరి మహేందర్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం అతి చిన్న వయస్సులోనే ప్రాణత్యాగం చేసిన కల్నాల్ సంతోష్ బాబు త్యాగగాథ యావత్ దేశానికి గర్వకారణమని తెలిపారు. క్రమశిక్షణ, అపారమైన ప్రతిభ కలిగిన సంతోష్ బాబు జీవించి ఉంటే భారత సైన్యంలో అత్యున్నత స్థాయికి ఎదిగి దేశానికి మరింత సేవలు అందించేవారని పేర్కొన్నారు. 2020 జూన్ 15న భారత–చైనా సైనిక ఘర్షణలో మాతృభూమి రక్షణ కోసం వీరమరణం పొందిన అనంతరం కుటుంబం ఎదుర్కొన్న బాధను గుర్తు చేస్తూ, భానుపురి ప్రజలు చూపిన మానవత్వం, సహకారానికి ప్రతిఫలంగా ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో సంతోష్ బాబు తల్లి బిక్కుమాళ్ల మంజుల ఎన్నికల బరిలోకి రావడం ప్రశంసనీయమన్నారు. అమర వీరుడి త్యాగాన్ని గౌరవిస్తూ అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమెకు మద్దతు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యార్థి, యువజన సంఘం బిక్కుమాళ్ల మంజులుకు పూర్తి మద్దతు తెలుపుతోందని ప్రకటించారు. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన అమర వీరుడి త్యాగాన్ని గౌరవిస్తూ, భానుపురి ప్రజల సేవ కోసం ఎన్నికల బరిలో నిలిచిన బిక్కుమాళ్ల మంజులును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని 44వ వార్డు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి బిక్కుమాళ్ల మంజులుతో పాటు తెలంగాణ విద్యార్థి, యువజన సంఘం నాయకులు శివ, మహేందర్, మహేష్, గోపి, విష్ణు, సంతోష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గాల్వన్ అమర వీరుడు కల్నాల్ సంతోష్ బాబు తల్లికి తెలంగాణ విద్యార్థి, యువజన సంఘం మద్దతు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News