Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:02 PM

గాంధీనగర్‌లో ఘనంగా వివాహ మహోత్సవం

గాంధీనగర్‌లో ఘనంగా వివాహ మహోత్సవం

గాంధీనగర్‌లో ఘనంగా వివాహ మహోత్సవం
07-03-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నూతన వధూవరులను ఆశీర్వదించిన వట్టే జానయ్య యాదవ్

సూర్యాపేట, మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు గాంధీనగర్ సమీపంలోని పెద్దమ్మ తల్లి కళ్యాణ మండపంలో గంజి శైలజ, వెంకన్న దంపతుల కుమార్తె వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. బంధుమిత్రులు, ఆహ్వానితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను మాత్రమే కాకుండా రెండు కుటుంబాలను కలిపే పవిత్ర బంధమని అన్నారు. పరస్పర అవగాహన, ప్రేమ, సహకారంతో వధూవరులు ఆనందంగా కుటుంబ జీవితం సాగించాలని ఆకాంక్షించారు. సమాజంలో మంచి ఆదర్శంగా నిలిచే విధంగా జీవితం గడపాలని ఆశీర్వచనాలు అందించారు.

వివాహ వేడుకలో బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, ముక్కాముల సుమన్, వట్టే లింగరాజు, మల్లికార్జున్, ఉప్పునూతల కోటేష్, మామిడి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

Sthanikam

గాంధీనగర్‌లో ఘనంగా వివాహ మహోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News