రెండు వర్గాల ఘర్షణతో సూర్యాపేట–జనగామ రహదారిపై రాస్తారోకో
సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు గాంధీనగర్ ప్రాంతంలో రెండు రాజకీయ వర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనతో ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఘర్షణ అనంతరం పోలీసులు అకారణంగా తమపై దాడి చేశారని ఆరోపిస్తూ ఒక వర్గానికి చెందిన కార్యకర్తలు సూర్యాపేట–జనగామ ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు భారీగా స్తంభించాయి. రెండు వైపులా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. నిరసనకారులతో చర్చలు జరిపి రహదారిని ఖాళీ చేయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా అదనపు బలగాలను మోహరించారు.ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి