Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

గడప గడపకు వెళ్లి ప్రజల గుండెను గెలుచుకున్న కాంగ్రెస్ నాయకత్వం

Updated : 08 Feb 2026 23:52 IST
As Preferred Source 1 min read
గడప గడపకు వెళ్లి ప్రజల గుండెను గెలుచుకున్న కాంగ్రెస్ నాయకత్వం

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి,మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి గజ్జెల కాంతం కలిసి ఈరోజు మున్సిపల్ పట్టణంలోని 12వ వార్డు అభ్యర్థి షారుక్ ఖాన్‌కు మద్దతుగా గడప గడపకు వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజలతో నేరుగా మాట్లాడుతూ వారి సమస్యలను శ్రద్ధగా విని, పట్టణ అభివృద్ధికి చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు.ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఇబ్బందులను తెలుసుకొని, వాటికి తక్షణమే పరిష్కార మార్గాలు చూపుతామని హామీ ఇచ్చారు.పారదర్శకతతో, జవాబుదారీతనంతో పాలన అందిస్తామని స్పష్టం చేయడంతో ప్రజల్లో విశ్వాసం,ఉత్సాహం వెల్లివిరిసింది.మున్సిపల్ ఎన్నికల ద్వారా 12వ వార్డులో రోడ్లు,తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని తెలిపారు.పేదలకు ఇళ్ల నిర్మాణం, ఆరోగ్య భద్రత, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల ద్వారా నారాయణఖేడ్ పట్టణాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తామని స్పష్టం చేశారు.గత పదేళ్లుగా డ్రైనేజీ నీరు తాగునీటిలో కలుస్తూ స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రజలు వారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యపై స్పందించిన శాసనసభ్యుడు, శాశ్వత పరిష్కారం చూపించి ప్రజలను కష్టాల నుంచి విముక్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

గడప గడపకు వెళ్లి ప్రజల గుండెను గెలుచుకున్న కాంగ్రెస్ నాయకత్వం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి