Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:44 AM

గద్దర్ స్ఫూర్తి పురస్కారం అందుకున్న డాక్టర్ కల్లేపల్లి నరేష్

30-01-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట

ప్రజా యుద్ధనౌక, విప్లవకవి గద్దర్ జయంతిని పురస్కరించుకొని నాంపల్లి కేంద్రంలోని తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారకరామారావు కళామందిరంలో గురువారం రాత్రి గద్దర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫాన్ ఇండియన్ సామాజిక సాంస్కృతిక సంఘం, ఇండో కెనడియన్ యువజన మండలి, పుడమి సాహితి వేదిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అద్దంకి రాజా యోనా నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ వేడుకల్లో మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, గద్దర్ కుమార్తె డాక్టర్ జీవి వెన్నెల గద్దర్ చేతుల మీదుగా సూర్యాపేటకు చెందిన తెలంగాణ దళిత విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, రాఘవేంద్ర డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకుడు, ఐఎన్టియుసి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కల్లేపల్లి నరేష్ గద్దర్ స్ఫూర్తి పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ మాట్లాడుతూ సాంస్కృతిక, సామాజిక, సాహిత్య రంగాల్లో సమాజాన్ని జాగృతం చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించిన ప్రజా యుద్ధనౌక, జానపద వాగ్గేయకారుడు, విప్లవకవి గద్దర్ జయంతి సందర్భంగా జాతీయ స్ఫూర్తి పురస్కార స్మారక ప్రశంసా పత్రాన్ని అందుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాటలతో కీలక పాత్ర పోషించిన గద్దర్ తెలంగాణ గుండె చప్పుడు అని కొనియాడారు.పుడమి సాహితి వేదిక చైర్మన్ చిలుముల బాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వేణుగోపాలచారి, గద్దర్ కుమార్తె డాక్టర్ జీవి వెన్నెల గద్దర్, ఇండో కెనడియన్ యువజన మండలి వ్యవస్థాపకులు రొయ్యూరు శేష సాయి, టిటిడి బోర్డు పూర్వ సభ్యులు ధరావత్ బాల్ సన్ నాయక్, పారిశ్రామికవేత్త డాక్టర్ యామినేని ఉప్పల్ రావు, సామాజికవేత్త గొల్లమందల దానయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గద్దర్ స్ఫూర్తి పురస్కారం అందుకున్న డాక్టర్ కల్లేపల్లి నరేష్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News