Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:04 PM

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు అండగా కూనూరు సంజయ్ దాస్ గౌడ్

23-02-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

సామాజిక సేవలో ఎల్లప్పుడూ ముందుండే కూనూరు సంజయ్ దాస్ గౌడ్ మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పరీక్ష ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న 39 మంది పదవ తరగతి విద్యార్థులకు ఆయన ఆర్థిక సహాయం అందించారు. వారి పరీక్ష ఫీజులను స్వయంగా భరించి చెల్లించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించారు.

తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగుతున్న సంజయ్ దాస్ గౌడ్, “డబ్బుల కొరత వల్ల ఏ విద్యార్థి చదువు ఆగకూడదు. విద్యే వారి భవిష్యత్తును నిర్మిస్తుంది” అని పేర్కొన్నారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపశమనాన్ని కలిగించిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

ఈకార్యక్రమంలోప్రధానోపాధ్యాయురాలు బోడ సుశీల, పీఆర్‌టీయూ రాష్ట్ర నాయకులు బాదం బిక్షపతి, తెలంగాణ ఉద్యమ నాయకులు జోగు లింగస్వామి, జిట్ట మల్లేష్, ఉపాధ్యాయులు చెలకరాజు శ్రీనివాస్, నర్రా సరళ తదితరులు పాల్గొన్నారు.విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు సంజయ్ దాస్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా విద్య, ఆరోగ్యం మరియు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు.విద్యార్థుల భవిష్యత్తు కోసం సమాజం కలిసి ముందుకు రావాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం మరోసారి స్పష్టంచేసింది.

Sthanikam

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు అండగా కూనూరు సంజయ్ దాస్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News