Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:37 AM

ఎస్సీ యాక్షన్ ప్లాన్ అమలుకు బ్యాంకుల సమన్వయం.

18-03-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్షేమ పథకాల అమలుపై వచ్చిన వార్తల ప్రభావంతో అధికార యంత్రాంగం వేగం పెంచింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అధ్యక్షతన బ్యాంక్ కంట్రోలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద బ్యాంకుల ద్వారా అమలు చేయాల్సిన జిల్లా లక్ష్యాలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక అనంతరం వారికి వెంటనే బ్యాంక్ అనుమతి (కాన్సెంట్) ఇవ్వాలని సూచించారు.

పథకాల అమలులో భాగంగా ఈవీ టూ వీలర్ యూనిట్లకు 10 శాతం, ఈవీ త్రీ వీలర్ యూనిట్లకు 30 శాతం, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ యూనిట్లకు 40 శాతం బ్యాంకు రుణం మంజూరు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ ప్రతిపాదనలకు బ్యాంక్ కంట్రోలర్లు సమ్మతి తెలిపారు.

ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జినుకల శ్యాంసుందర్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శివరామకృష్ణ, వంశీతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇతర బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

ఎస్సీ యాక్షన్ ప్లాన్ అమలుకు బ్యాంకుల సమన్వయం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News