Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:27 AM

ఎస్సారెస్పీ నుంచి నిరంతరంగా సాగునీటి విడుదల చేయాలి -గ్రామీణ పేదల సంఘం డిమాండ్

21-01-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

ఎస్సారెస్పీ నుంచి సాగునీటిని వారాబంది పద్ధతి లేకుండా నిరంతరంగా విడుదల చేయాలని గ్రామీణ పేదల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఈఈ యాదగిరికి సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య మాట్లాడుతూ, గత సంవత్సరం వారాబంది పద్ధతిలో నీటిని విడుదల చేస్తామని చెప్పడంతో రైతులు వరి నాట్లు వేసుకున్నారని తెలిపారు. అయితే చివరి భూములకు నీళ్లు అందక వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. ఆ సమయంలో అధికారులు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జనవరి నెలలో వారాబంది పద్ధతిలో నీటిని విడుదల చేస్తామని ప్రకటించడంతో రైతులు వరి నాట్లు వేసుకున్నారని, అయితే మొదటి దఫా విడుదల చేసిన నీళ్లు కూడా చివరి భూములకు అందకపోగా, కాలువల్లో కూడా పూర్తిస్థాయిలో ప్రవహించలేదని తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి చివరి భూములకు నీళ్లు అందేలా స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని, లేదా కనీసం చెరువులు, కుంటలు నింపేలా చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేసింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని గ్రామీణ పేదల సంఘం పేర్కొంది. ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య, ఓపీడీఆర్ జిల్లా కార్యదర్శి సుంకరి రమేష్ బాబు, ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ జిల్లా కార్యదర్శి భాషిపంగు సునీల్, అనంతుల యల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎస్సారెస్పీ నుంచి నిరంతరంగా సాగునీటి విడుదల చేయాలి -గ్రామీణ పేదల సంఘం డిమాండ్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News