Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెద్దకాపర్తి ఫ్లైఓవర్‌పై కారు–ఎలక్ట్రిక్‌ బస్సు ఢీ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:35 PM

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు నష్టపరిహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి.

08-01-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

జిల్లా కలెక్టర్‌కు వినతి

స్థానికం: యదాద్రి భువనగిరి జిల్లా బుర్యో జి.శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లాలో గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ...యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గురువారం జిల్లా కలెక్టర్ హనుమంతు రావుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు బర్రె సుదర్శన్ మాట్లాడుతూ…జిల్లా వ్యాప్తంగా అనేక మంది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు ఇప్పటివరకు కేవలం కొంతమేర మాత్రమే పరిహారం అందిందని ఆవేదన వ్యక్తం చేశారు.మిగిలిన పరిహారం ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటంతో బాధితులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.అట్రాసిటీ కేసుల బాధితులకు చట్టప్రకారం అందాల్సిన పూర్తి నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలని,అలాగే వారికి వర్తించే అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను తక్షణమే అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ను గట్టిగా కోరారు. బాధితులకు న్యాయం జరిగేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన కార్యక్రమంలో నాయకులు నల్ల కృష్ణతో పాటు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు నష్టపరిహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News