Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:51 AM

ఎస్ఐఆర్ మ్యాపింగ్‌కు రాజకీయ పార్టీల సహకారం అవసరం: కలెక్టర్

31-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మ్యాపింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

మంగళవారం మినీ మీటింగ్ హాల్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితంగా నిర్వహించేందుకు బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాలను వెంటనే సమర్పించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులు సమర్థవంతంగా పని చేయడానికి రాజకీయ పార్టీల సహకారం అవసరమన్నారు.

త్వరలో నిర్వహించనున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై వివరాలు తెలియజేస్తూ, బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తారని తెలిపారు. ఎన్యూమరేటర్ ఫారమ్ ద్వారా సమాచారం నమోదు చేసి, ఒక ప్రతిని ఓటరుకు అందజేస్తారని వివరించారు.

ఈ సమావేశంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

ఎస్ఐఆర్ మ్యాపింగ్‌కు రాజకీయ పార్టీల సహకారం అవసరం: కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News