Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:20 PM

ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్‌కు అయ్యప్ప మాల మహా ప్రసాదం అందజేత

16-01-2026 616 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ కు అయ్యప్ప మాల మహా ప్రసాదాన్ని ప్రముఖ సామాజిక సేవకర్త, తెలంగాణ రాష్ట్ర ఉత్తమ రక్తదాత అవార్డు గ్రహీత, ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ డి. ఓం ప్రకాష్ మర్యాదపూర్వకంగా అందజేశారు.ఇటీవల అయ్యప్ప మాల ధారణ చేసి, అయ్యప్ప స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న అనంతరం,అయ్యప్ప స్వామి ఆశీస్సుల ప్రతీకగా మహా ప్రసాదాన్ని డాక్టర్ డి. ఓం ప్రకాష్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ వారికి అందించడం జరిగింది.ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి కృపతో ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ గారిని కలిసిన డాక్టర్ డి. ఓం ప్రకాష్ , సమాజ సేవ, మానవ హక్కుల పరిరక్షణ, రక్తదాన సేవల ద్వారా ప్రజలకు చేస్తున్న సేవలను వివరించారు.ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ డాక్టర్ ఓం ప్రకాష్ సేవలను అభినందిస్తూ, ఇటువంటి సేవాభావం ప్రతి ఒక్కరిలో పెంపొందాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శాంతయ్య స్వామి, షాపూర్ గ్రామ సర్పంచ్ మహాలింగ్ పాటిల్, నాయకులు రాజు నాయక్, శివుకాంత్ పాటిల్, ప్రశాంత్, విజయకుమార్ స్వామి, సాయి చరణ్ తదితర ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం భక్తి వాతావరణంలో ప్రశాంతంగా ముగిసింది.

Sthanikam

ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్‌కు అయ్యప్ప మాల మహా ప్రసాదం అందజేత

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News