Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:37 AM

ఏప్రిల్ 2న వోలేశ్వర లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణం

17-03-2026 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అనాజిపురంలో బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు.. భక్తులకు విస్తృత ఏర్పాట్లు

యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం:

శతాబ్దాల చరిత్ర కలిగిన అనాజిపురం వోలేశ్వరం స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం ఏప్రిల్ 2న నిర్వహించనున్నారు. చారిత్రాత్మక మహిమాన్విత దేవాలయంలో జరగనున్న చతుర్వార్షిక బ్రహ్మోత్సవాలకు గ్రామ పెద్దలు, దేవస్థాన కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా సోమవారం గ్రామ సర్పంచ్ రాయపురం సురేష్, ఉపసర్పంచ్ వెలిశాల మురళి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు సమావేశమై ఉత్సవాల నిర్వహణపై ప్రణాళికలు రూపొందించారు. భువనగిరి పట్టణానికి సమీపంలో ఉన్న ఈ దేవాలయానికి పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండడంతో అన్నదానం, ప్రసాదాలు, మంచినీటి సదుపాయం, రవాణా వంటి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

నాటి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈసారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. ప్రత్యేక పూజలు, ఆలయ అవతార సేవలు సాంప్రదాయ పద్ధతుల ప్రకారం నిర్వహించనున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దల సమక్షంలో పురోహితులు స్వామివారి బ్రహ్మోత్సవాల లగ్నపత్రికను సాంప్రదాయబద్ధంగా ఆవిష్కరించారు. చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా గురువారం జరగనున్న బ్రహ్మోత్సవాలకు పరిసర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

కార్యక్రమంలో నీలం భిక్షపతి, గునుగుంట్ల శ్రీనివాస్, ఏదునూరి మల్లేష్, బొల్లేపల్లి మాణిక్యం, పిట్టల శ్రీశైలం, ఏదునూరి నరేష్, వెలిశాల కృష్ణ, బొల్లేపల్లి అశోక్, నీలం వెంకటేష్, నోముల వెంకటేష్, గోదా మల్లయ్య, గోగు పోశాలు, రాచమల్ల విజయకుమార్, తోటకూర మల్లేష్, ఏదునూరి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఏప్రిల్ 2న వోలేశ్వర లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News