Sthanikam - Truth Matters
Logo

ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఈదురు గాలులు, తెగిన విద్యుత్ తీగలతో మహేంద్ర వాహనం పల్టీ – లారీ బోల్తా

Updated : 24 Feb 2026 13:10 IST
As Preferred Source 1 min read
ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఈదురు గాలులు, తెగిన విద్యుత్ తీగలతో మహేంద్ర వాహనం పల్టీ – లారీ బోల్తా

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: తెల్లవారుజామున కురిసిన ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా తిరువూరు పరిసర ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. లక్ష్మీపురం వద్ద విస్సన్నపేట రోడ్డుపై బలమైన గాలులకు విద్యుత్ తీగలు తెగిపడటంతో రహదారిపై ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది.

కావలి నుంచి కడక్పూర్ వైపు బాతులు లోడుతో వెళ్తున్న మహేంద్ర పికప్ వాహనం, రోడ్డుపై పడిన విద్యుత్ తీగలను తప్పించే క్రమంలో మార్జిన్‌లోకి వెళ్లి పల్టీ కొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ, వర్షంతో తడిసిన రోడ్డుపై నియంత్రణ కోల్పోయి స్కిడ్ అవడంతో మార్జిన్‌లోకి దూసుకెళ్లి మహేంద్ర వాహనంపై బోల్తా కొట్టింది.

ఈ ప్రమాదంలో టెంపో వాహన డ్రైవర్‌కు స్వల్ప గాయాలతోనే ప్రమాదం తప్పినట్టు సమాచారం. పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగకపోవడం స్థానికులకు ఊరట కలిగించింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. తెగిన విద్యుత్ తీగలను తొలగించేందుకు విద్యుత్ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

వర్షాకాలంలో రహదారులపై జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసులు వాహనదారులకు సూచించారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news