Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:10 PM

ఎన్‌పిఆర్‌డీ ఆవిర్భావ దినోత్సవ సదస్సును జయప్రదం చేయండి

27-02-2026 93 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెన్షన్ పెంపు, బడ్జెట్‌లో నిధుల పెంపు కోసం ఉద్యమం

ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధనకు పోరాటం

రామన్నపేట మండలం జనంపెళ్లి, కక్కిరేణి గ్రామాల్లో ఎన్‌పిఆర్‌డీ 16వ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు.

నేషనల్ ప్లాట్‌ఫాం ఫర్ ది రైట్స్ ఆఫ్ ది డిసేబుల్డ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ, 2010 ఫిబ్రవరి 21, 22 తేదీల్లో సంఘం ఆవిర్భవించిందని గుర్తుచేశారు. ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

వికలాంగుల పెన్షన్ పెంపు, కేంద్ర–రాష్ట్ర బడ్జెట్‌లలో నిధుల కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. 2026–27 కేంద్ర బడ్జెట్‌లో వికలాంగుల సంక్షేమానికి కేవలం రూ.1669.72 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. 2012 నుంచి ఇందిరా గాంధీ జాతీయ పెన్షన్ పథకానికి తగిన నిధులు ఇవ్వడం లేదన్నారు.

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వికలాంగుల హక్కుల అమలులో నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016 అమలు సరిగా జరగడం లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వికలాంగులకు అనుకూల సదుపాయాలు లేవని, యూడీఐడీ కార్డుల జారీ ప్రక్రియలో ఆలస్యం జరుగుతోందన్నారు.

ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని, పెన్షన్ పెంపు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. వికలాంగులపై దాడులు, మహిళలపై వేధింపుల ఘటనలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పిట్ట శ్రీనివాస్ రెడ్డి, వేముల సైదులు, పున్న శ్రీధర్, మెడబోయిన రమేష్, కన్నబోయిన మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎన్‌పిఆర్‌డీ ఆవిర్భావ దినోత్సవ సదస్సును జయప్రదం చేయండి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News