జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సైలెన్స్ పీరియడ్ అమలులోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీ హర్ష తెలిపారు.పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి సైలెన్స్ పీరియడ్ అమలు చేయాలని ఆదేశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ ప్రారంభమై, ఫిబ్రవరి 11 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందన్నారు.ఈ సమయంలో ఎలాంటి ఎన్నికల ప్రచారం, ర్యాలీలు, సమావేశాలు, సభలు, ప్రకటనలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అలాగే ఫలితాలను ప్రభావితం చేసే వార్తలు, ఎగ్జిట్ పోల్స్, అంచనాలను పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం నిషేధమన్నారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి హెచ్చరించారు.
PRINT TIME: October 15, 2026 11:36 AM
ఎన్నికల ప్రచారానికి బ్రేక్: సైలెన్స్ పీరియడ్ అమలు

09-02-2026
33 Views
స్థానికం ప్రతినిధి :
Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సైలెన్స్ పీరియడ్ అమలులోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీ హర్ష తెలిపారు.పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి సైలెన్స్ పీరియడ్ అమలు చేయాలని ఆదేశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ ప్రారంభమై, ఫిబ్రవరి 11 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందన్నారు.ఈ సమయంలో ఎలాంటి ఎన్నికల ప్రచారం, ర్యాలీలు, సమావేశాలు, సభలు, ప్రకటనలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అలాగే ఫలితాలను ప్రభావితం చేసే వార్తలు, ఎగ్జిట్ పోల్స్, అంచనాలను పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం నిషేధమన్నారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి హెచ్చరించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి