Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:03 AM

ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాలతో గ్రామీణ చైతన్యం: దోరేపల్లి, పగిడిమర్రిలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం"

ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాలతో గ్రామీణ చైతన్యం: దోరేపల్లి, పగిడిమర్రిలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం"

ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాలతో గ్రామీణ చైతన్యం: దోరేపల్లి, పగిడిమర్రిలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం"
January 22, 2026 02:07 AM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాలతో గ్రామీణ చైతన్యం: దోరేపల్లి, పగిడిమర్రిలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం"

నల్లగొండ జిల్లా స్థానికం ప్రతినిధి : డి.డి. దాస్

ఈరోజు దోరేపల్లి,పగిడిమర్రి గ్రామాలలో నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి,)నల్గొండ ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాలు ఉపేందర్ గారి అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ఆధ్వర్యంలో దోరేపల్లి గ్రామంలో మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ సిక్స్ ఆధ్వర్యంలో పగిడిమర్రి గ్రామాలలో శీతాకాల ప్రత్యేక శిబిరాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకట రమణారెడ్డి గారు ,ముఖ్య అతిథి కనగల్ మండలం ఎంపీడీవో వేద రక్షిత గారు పాల్గొన్నారు.

ముఖ్య అతిథి కనగల్ మండలం ఎంపీడీవో వేద రక్షిత గారు మాట్లాడుతూ విద్యార్ధులలో ఉన్న సేవాభావాన్ని వెలికి తీసే అవకాశం తోబాటు మంచి వ్యక్తిత్వం గల పౌరులుగా తయారువుతారని అన్నారు.

 ఈ కార్యక్రమంలోమహాత్మా గాంధీ యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ రమణారెడ్డి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో వారం రోజులపాటు నిర్వహించే ప్రత్యేక శిబిరాలను గ్రామ ప్రజలకు సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలు, అక్షరాస్యత, ఆరోగ్యం పై అవగాహన మరియు సాంస్కృతిక కార్యకలాపాల రూపంలో ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు.

పగిడిమర్రి గ్రామ సర్పంచ్ మరియు దోరేపల్లి సర్పంచ్ గారు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ యూనిట్ శిక్ష ఆధ్వర్యంలో మా గ్రామంలో వారం రోజులపాటు శ్రమదానంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కలిగిస్తున్నందుకు మా గ్రామానికి విచ్చేసిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కు అభినందనలు తెలియజేశారు.పగిడిమర్రి గ్రామ సర్పంచ్ నాగవల్లి నాగమణి గారు, లింగాల గూడెం సర్పంచ్ కదిరే సైదులు గారు ,కిసాన్ సెల్ జిల్లా ప్రెసిడెంట్ గోలి జగాల్ రెడ్డి గారు, ఎనిమిదో వార్డు మెంబర్ గాజుల మారయ్య గారు ,ఒకటవ వార్డు మెంబర్ దాసరి లక్ష్మి గారు, నాల్గవ వార్డు నెంబర్ దాసరి అంజమ్మ గారు ,ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కన్నెబోయిన నరసింహ గారు, కదిరే నాగరాజు , యన్ యస్ యస్ యూనిట్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ నర్సింగ్ కోటయ్య,కంబాల పల్లి శివరాణి,కదిర నాగరాజు డాక్టర్ అంకుష్,బోధన మరియు బోధనేతర సిబ్బంది, గ్రామ ప్రజలు ప్రజలు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News