Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:35 AM

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు

18-05-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ని సోమవారం మోతే మండల కేంద్రంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కోదాడ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గడ్డం అంజి, ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు, ఉపాధ్యక్షుడు బాణాల అబ్రహము, కోశాధికారి షేక్ నూరుద్దీన్, గౌరవ సలహాదారులు బత్తిని కృష్ణమూర్తి మరియు కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా రంగం కీలక పాత్ర పోషిస్తుందని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల కృషి అభినందనీయమన్నారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి, జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గడ్డం అంజి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, జర్నలిస్టు కోటాలో ఇందిరమ్మ ఇల్లు ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి అవసరమైన స్థలం మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు.

Sthanikam

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News