Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

ఎమ్మెల్యే సహకారంతో నేలపట్లలో నూతన ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

27-02-2026 260 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నేలపట్ల గ్రామంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి శుక్రవారం గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నాగేష్ గౌడ్ ప్రారంభించారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరు చేయడం గ్రామస్థుల్లో హర్షాతిరేకం నింపింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు వల్ల తక్కువ వోల్టేజ్, తరచూ ఎదురయ్యే విద్యుత్ అంతరాయ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. గ్రామస్థులు కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌తో విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చిన్నం బాలరాజ్, 5వ వార్డు మెంబర్ పాలమాకుల కవిత నర్సింగ్, 6వ వార్డు మెంబర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పాలమాకుల నవ్య నరసింహ, 7వ వార్డు మెంబర్ కత్తుల సాయికుమార్, 8వ వార్డు మెంబర్ బూడిద లింగస్వామి, మాజీ సర్పంచ్ గుండు మల్లయ్య, మాజీ ఉపసర్పంచ్ తడక వెంకటేశం, మాజీ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కోడం రాములు, పాలమాకుల యాదయ్య, తడక ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మెల్యే సహకారంతో నేలపట్లలో నూతన ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News