Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:04 PM

ఎల్‌ఐసీ భవన నిర్మాణానికి భూమి కేటాయింపునకు కృషి......

18-02-2026 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని బాబు...

మున్సిపల్ వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి.......

కోదాడ పట్టణంలో ఎల్‌ఐసీ భవన నిర్మాణానికి ప్రభుత్వ భూమిని కేటాయించే విధంగా రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరిలు హామీ ఇచ్చారు. కోదాడలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏజెంట్ల సమైక్య భవనం (లియాఫీ) 8వ వార్షికోత్సవం,, అలాగే ఎల్‌ఐసీ కార్యాలయం ప్రారంభించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కోదాడ లియాఫీ అధ్యక్షులు కంజుల మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. నాలుగు దశాబ్దాలుగా కోదాడ ప్రాంత ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ఎల్ఐసి కార్యాలయానికి సొంత భవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి స్థలం కేటాయించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.అనంతరం లియాఫీ డివిజన్ అధ్యక్షులు పి. రామస్వామి మాట్లాడుతూ ఎల్‌ఐసీ సంస్థ అభివృద్ధిలో ఏజెంట్లు వెన్నెముకలా పనిచేస్తున్నారని, అయితే వారి సమస్యల పట్ల యాజమాన్యం సరైన రీతిలో స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెంట్ల సంక్షేమం మరియు వారి సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కోదాడ లియాఫీ అధ్యక్షులు కంజుల మోహన్ రెడ్డి, డివిజన్ సెక్రెటరీ సునీల్ కుమార్, కోశాధికారి రమణారెడ్డి, జోనల్ లీడర్ కొప్పోజు సూర్యనారాయణ, సెక్రటరీ మల్లేష్, కోశాధికారి వీరయ్య, బ్రాంచ్ మేనేజర్ రమేష్ రెడ్డి, ఏబిఎం రాము, పోతుగంటి వెంకటాద్రి, డివో సైదా, సైదులు, విజయశంకర్, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.......

Sthanikam

ఎల్‌ఐసీ భవన నిర్మాణానికి భూమి కేటాయింపునకు కృషి......

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News