Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:40 AM

ఎకో బజార్‌తో పర్యావరణ చైతన్యం. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం

28-03-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా క్యాంపస్ కార్యక్రమం

రామన్నపేట: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ఎకో బజార్ నిర్వహించారు. భారత ప్రభుత్వ అటవీ, పర్యావరణ మరియు వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో, తెలంగాణ జాతీయ హరిత దళం సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.

కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ, చదువుతో పాటు పర్యావరణంపై బాధ్యత పెంచడం అవసరమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచుతాయని అన్నారు.

అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్న బాబు మాట్లాడుతూ, పర్యావరణానికి హాని కలిగించని పదార్థాల వినియోగం ద్వారా ఆరోగ్యకర జీవనం సాధ్యమని వివరించారు.

ఈ ఎకో బజార్‌లో విద్యార్థులు మట్టి బొమ్మలు, చిరుధాన్య వంటకాలు, పండ్లు–కూరగాయలతో చేసిన ఆహార పదార్థాలు, కాగిత కళాకృతులను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఎకో బజార్‌తో పర్యావరణ చైతన్యం. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News