Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:34 AM

ఎంగేజ్‌మెంట్ తరువాత వరుడు పెళ్లికి నిరాకరణ… మనస్తాపంతో తల్లి-కుమార్తె బలవన్మరణం

15-03-2026 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఎంగేజ్‌మెంట్ జరిగిన తర్వాత వరుడు పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి-కుమార్తె బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన సిరికొండ శ్రీనివాసరావు, సుజాత (46) దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె దివ్య (25) ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా కుమార్తె దివ్య గత మూడు సంవత్సరాలుగా హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది.

మార్టూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శేషుబాబుతో పెద్దలు వివాహం నిశ్చయించి గత సంవత్సరం డిసెంబర్ 14న నిశ్చితార్థం జరిపారు. ఈ వేసవిలో వివాహం జరగాల్సి ఉండగా ఈ నెల 4వ తేదీన వరుడు శేషుబాబు దివ్యతో పాటు ఆమె తల్లిదండ్రులను మార్టూరులోని తన నివాసానికి పిలిపించాడు. అక్కడ తాను హైదరాబాదులో దివ్యను రహస్యంగా అనుసరించి తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలు చూపించి పెళ్లికి నిరాకరిస్తున్నట్లు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి సుజాత, కుమార్తె దివ్య అదే రోజు మార్టూరులో ఎలుకల మందు, గడ్డి మందు కొనుగోలు చేసి స్వగ్రామమైన ద్రోణాదుల చేరుకుని వాటిని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మరుసటి రోజు సాయంత్రం అపస్మారక స్థితిలో ఉన్న వారిని గమనించిన శ్రీనివాసరావు తొలుత చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించి అనంతరం గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం చేర్పించారు.

గత వారం రోజులుగా చికిత్స పొందుతున్న సుజాత, దివ్యల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో దివ్య మృతి చెందగా, ఉదయం 10 గంటల ప్రాంతంలో తల్లి సుజాత కూడా ఆసుపత్రిలోనే కన్నుమూశారు.

ఈ ఘటనపై భర్త శ్రీనివాసరావు గుంటూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి మార్టూరు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ విషాద ఘటన ద్రోణాదుల గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Sthanikam

ఎంగేజ్‌మెంట్ తరువాత వరుడు పెళ్లికి నిరాకరణ… మనస్తాపంతో తల్లి-కుమార్తె బలవన్మరణం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News