Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:59 PM

విద్యతోనే.. నాగరికత, నాగరికత తోనే అభివృద్ధి సాధ్యం ; ఎమ్మెల్యే మందుల సామెల్

21-03-2026 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

విద్యతోనే నాగరికత నాగరికతవని అభివృద్ధి సాధ్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.

తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో సామాజిక చైతన్యానికి నాంది పలుకుతూ అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో మహనీయులు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించగా.. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాన్ని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్, బహుజన యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్న చేతులమీదుగా శనివారం అదే స్థలంలో పునః ప్రతిష్ట చేసి అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే క్రీడోత్సవాలను సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు.

అనంతరం మహనీయుల విగ్రహాల నిర్వహణ కమిటీ అధ్యక్షులు చింతకుంట్ల విట్టల్ సభా అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. సమాజంలో సమానత్వం, విద్యాభివృద్ధి దళితుల హక్కుల కోసం వారు చేసిన కృషిని కొనియాడారు.మహనీయుల ఆలోచనలు ప్రతి ఒక్కరు ఆచరణలో పెట్టాలని, సమాజంలో ఐక్యతను పెంపొందించాలని పిలుపునిచ్చారు.జ్యోతిరావు ఫూలే మహిళా విద్య, కులవ్యవస్థ నిర్మూలనలో కీలక పాత్ర పోషించగా, బాబు జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడిగా నిలిచారని పేర్కొన్నారు.పూలే చూపిన విద్యా దీపం… జగ్జీవన్‌రామ్ చూపిన సమానత్వ మార్గం… ఇవే మనకు దిక్సూచులనీ ఎమ్మెల్యే ఘాటైన సందేశం ఇచ్చారు. సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం ఆగకూడదని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న, ఉప సర్పంచ్ అన్నబోయిన శ్రీకాంత్, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు,అరుంధతి యువజన సంఘం అధ్యక్షులు చింతకుంట్ల పరమేష్,ఉప సర్పంచ్ శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ కేతిరెడ్డి లతా విజయకుమార్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, ఏవైసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాశం అజయ్ కుమార్, గౌరవాధ్యక్షులు చింతకుంట్ల వెంకన్న(బిల్డర్), విగ్రహ నిర్వహణ కమిటీ ఉపాధ్యక్షులు మందుల నరేష్, ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల పరమేష్ (బాబు), సభ్యులు మందుల పరమేష్, చింతకుంట్ల సైదులు, మాచర్ల ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రేగటి రవి, సుంకరి జనార్ధన్,వివిధ గ్రామాల సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు, యువజన లు మహిళలు భారీగా హాజరై మహనీయుల సేవలను స్మరించుకున్నారు.

Sthanikam

విద్యతోనే.. నాగరికత, నాగరికత తోనే అభివృద్ధి సాధ్యం ; ఎమ్మెల్యే మందుల సామెల్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News