Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:34 AM

విద్యుత్ కార్మికుల సమ్మె హెచ్చరిక – డిమాండ్లపై స్పందించాలంటూ నోటీసులు

21-03-2026 326 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణ కేంద్రంలో విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిసన్, అన్‌మ్యాన్డ్, పీస్‌రేట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAEJAC) నాయకులు సమ్మె నోటీసులు అందజేశారు.

TG GENCO, TGTRANSCO, TGSPDCL, TGNPDCL సంస్థల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. 20–25 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యాలు పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వైస్ చైర్మన్ చింత ఎల్లయ్య, జేఏసీ చైర్మన్ ఎస్. సతీష్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

భవిష్యత్ కార్యాచరణగా ఈ నెల 26, 30 తేదీలలో డివిజన్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, ఏప్రిల్ 2న సర్కిల్ కార్యాలయాల వద్ద వంటావార్పు, 4న పాల్వంచలో ధర్నా, 7న వరంగల్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.

Sthanikam

విద్యుత్ కార్మికుల సమ్మె హెచ్చరిక – డిమాండ్లపై స్పందించాలంటూ నోటీసులు

Article Image

నల్గొండ పట్టణ కేంద్రంలో విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిసన్, అన్‌మ్యాన్డ్, పీస్‌రేట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAEJAC) నాయకులు సమ్మె నోటీసులు అందజేశారు.

TG GENCO, TGTRANSCO, TGSPDCL, TGNPDCL సంస్థల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. 20–25 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యాలు పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వైస్ చైర్మన్ చింత ఎల్లయ్య, జేఏసీ చైర్మన్ ఎస్. సతీష్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

భవిష్యత్ కార్యాచరణగా ఈ నెల 26, 30 తేదీలలో డివిజన్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, ఏప్రిల్ 2న సర్కిల్ కార్యాలయాల వద్ద వంటావార్పు, 4న పాల్వంచలో ధర్నా, 7న వరంగల్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News