Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:46 AM

విద్యుత్ బిల్లు బకాయి ఉంటే వెంటనే కనెక్షన్ కట్ చేయరాదు

09-03-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

విద్యుత్ బిల్లు చెల్లింపుల విషయంలో వినియోగదారులకు చట్టం కొన్ని హక్కులను కల్పించింది. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 లోని సెక్షన్ 56 ప్రకారం, వినియోగదారు బిల్లు గడువు తేదీలోపు చెల్లించకపోయినా విద్యుత్ శాఖ వెంటనే కనెక్షన్‌ను నిలిపివేయలేరు.

చట్టం ప్రకారం విద్యుత్ సరఫరా సంస్థ ముందుగా వినియోగదారునికి లిఖితపూర్వక నోటీసు ఇవ్వాలి. ఆ నోటీసు ఇచ్చిన తర్వాత కనీసం 15 రోజుల గడువు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ గడువు ముగిసే వరకు బిల్లు చెల్లించకపోతే మాత్రమే విద్యుత్ కనెక్షన్‌ను నిలిపివేయడానికి విద్యుత్ శాఖకు అధికారం ఉంటుంది.

అదేవిధంగా సెక్షన్ 56(2) ప్రకారం రెండు సంవత్సరాలకు మించిన పాత బకాయిల ఆధారంగా వినియోగదారుల విద్యుత్ కనెక్షన్‌ను కట్ చేయలేరు. అయితే ఆ బకాయిలు వినియోగదారుని బిల్లులో నిరంతరం చూపిస్తే మాత్రమే వాటిని వసూలు చేసే అవకాశం ఉంటుంది.

విద్యుత్ బిల్లు సాధారణంగా స్టేట్మెంట్ మాత్రమే అని, దానిని డిస్కనెక్షన్ నోటీసుగా పరిగణించరాదని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ వినియోగదారులు సమయానికి బిల్లులు చెల్లించడం తమ బాధ్యత అని అధికారులు సూచిస్తున్నారు.

Sthanikam

విద్యుత్ బిల్లు బకాయి ఉంటే వెంటనే కనెక్షన్ కట్ చేయరాదు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News