Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా కవాడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 15, 2026 05:28 AM

విద్య–సంస్కృతుల సమన్వయంగా వసంత పంచమి వేడుకలు సౌమ్య విద్యామందిర్‌లో ప్రత్యేక కార్యక్రమాలు

విద్య–సంస్కృతుల సమన్వయంగా వసంత పంచమి వేడుకలు సౌమ్య విద్యామందిర్‌లో ప్రత్యేక కార్యక్రమాలు

విద్య–సంస్కృతుల సమన్వయంగా వసంత పంచమి వేడుకలు సౌమ్య విద్యామందిర్‌లో ప్రత్యేక కార్యక్రమాలు
January 23, 2026 09:12 PM 247 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సౌమ్య విద్యామందిర్‌లో ప్రత్యేక కార్యక్రమాలు

చిట్యాల స్థానికం ప్రతినిధి ప్రశాంత్:

చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినాన్ని పురస్కరించుకుని చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలోని సౌమ్య విద్యామందిర్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలను పాఠశాల ప్రిన్సిపల్ బొడిగె విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో స్థానిక ఆలయ అర్చకుడు బోగ మహేష్ సరస్వతీ దేవి పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ పాలకవర్గ సభ్యులతో కలిసి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అర్చకుడు వారికి అమ్మవారి ఆశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. అనంతరం సర్పంచ్, ఉపసర్పంచ్ లు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి తొలి అక్షరాలను దిద్దించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి రోజున జరుపుకునే పవిత్ర పర్వదినమని, ఇది వసంత ఋతువు ఆరంభానికి సంకేతమని తెలిపారు.జ్ఞానం, విద్య, కళలకు ప్రతీక అయిన సరస్వతీ దేవిని ఈ రోజున పూజించడం ద్వారా విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సంస్కృతి, ఆధ్యాత్మికత, జ్ఞానార్జన పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు సాంప్రదాయ విలువలను కాపాడేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సాంస్కృతిక వేడుకలు మరిన్ని నిర్వహించి, పిల్లల్లో విద్యా సంస్కారాలు మరింత పెంచాలని కోరారు. అనంతరం ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొంది తొలిసారిగా పాఠశాలకు వచ్చిన నూతన సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్, ఉపసర్పంచ్ బెల్లంకొండ లావణ్య రఘు, వార్డు సభ్యులు పాకాల నరసింహ, రుద్రారపు లక్ష్మణ్, పల్లపు పరమేశ్వరి ప్రశాంత్, ఈరమల్ల దయాకర్, వలిగొండ కవిత సత్యనారాయణ, రొండి నరసింహ, దేశపాక మధు, నందిపాటి పార్వతమ్మ బాలయ్య, పెరిక నాగరాజు లను పాఠశాల ప్రిన్సిపల్ బొడిగె విజయ్ కుమార్ శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో నాయకులు నందిపాటి మహేష్, సామాజిక కార్యకర్త పొలిమేర దశరథ, ఉపాధ్యాయులు బొడిగె రాణి, రుద్రారపు లావణ్య, మునుకుంట్ల వేణు, ఈరమల్ల లూసిక, మునుకుంట్ల స్వాతి, బెల్లంకొండ రాజేశ్వరి, సూరోజు హర్షిని, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News