Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:35 AM

విద్యారంగానికి నిధులు పెంచాలి: పీడీఎస్‌యూ

20-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు నిరాశాజనకంగా ఉన్నాయని పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు విమర్శించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇందూరు సాగర్, జిల్లా అధ్యక్షుడు పోలె పవన్, ప్రధాన కార్యదర్శి కామల్ల సంజయ్ మాట్లాడుతూ 2026–27 బడ్జెట్‌లో విద్యకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు.

మొత్తం రూ.3,24,234 కోట్ల బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం రూ.26,674 కోట్లు మాత్రమే కేటాయించడం అంటే సుమారు 8.22 శాతం మాత్రమేనని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన సుమారు రూ.8,500 కోట్ల బకాయిలను ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలో 15 శాతం నిధులు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం, విద్యా కమిషన్ సూచించిన 18 శాతం కేటాయింపులనూ అమలు చేయకపోవడం ప్రభుత్వ వైఖరిని వెల్లడిస్తోందని విమర్శించారు. విద్యారంగానికి కనీసం 20 నుంచి 30 శాతం వరకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమానికి అవసరమైన నిధులు కేటాయించకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని పేర్కొన్నారు. వెంటనే బడ్జెట్ సవరణలు చేసి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని కోరారు.

లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Sthanikam

విద్యారంగానికి నిధులు పెంచాలి: పీడీఎస్‌యూ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News