Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:35 AM

విద్యారంగానికి న్యాయం చేయాలి: విద్యార్థి సంఘాల డిమాండ్

20-03-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నార్కెట్‌పల్లి: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి తగిన నిధులు కేటాయించకపోవడంపై బీసీ విద్యార్థి సంఘం నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక బీసీ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాం దేవ్ మాట్లాడుతూ, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.

విద్యారంగానికి కేవలం 8 శాతం నిధులు మాత్రమే కేటాయించడం అన్యాయమని, అందులో ఎక్కువ భాగం జీతాలకే వెళ్తోందని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, నిరుద్యోగ భృతి వంటి కీలక అంశాలను పక్కన పెట్టారని ఆరోపించారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో విద్యకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొంటూ, కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం, నాగిళ్ల యాదయ్య, మేకల రాములు, లతీఫ్, కప్పల నరసింహ, పీట్ల దుర్గయ్య, మొయినుద్దీన్, బాలు, రుద్రారం యాదయ్య, మత్స్యగిరి, గణేష్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

విద్యారంగానికి న్యాయం చేయాలి: విద్యార్థి సంఘాల డిమాండ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News