Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:37 AM

విద్యార్థుల ఆవిష్కరణలకు వేదికగా ‘శ్రీ చైతన్యోత్సవ్–2026’

25-03-2026 153 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పొన్నేకల్,

శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్‌లో “కలర్స్ ఆఫ్ ఇన్నోవేషన్ – కలర్స్ ఆఫ్ సెలబ్రేషన్” థీమ్‌తో ‘శ్రీ చైతన్యోత్సవ్–2026’ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన ‘కలర్స్ ఆఫ్ ఇన్నోవేషన్’ కార్యక్రమానికి జేఎన్‌టీయూ డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను అభినందించారు. విద్యలో రీసెర్చ్ కీలకమని, సమాజానికి ఉపయోగపడే అంశాలపై పరిశోధనలు చేయాలని సూచించారు.

ఉత్సవంలో భాగంగా నిర్వహించిన బ్లడ్ డొనేషన్, అనాధాశ్రమాల సందర్శన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెకానికల్ విభాగం ఎలక్ట్రిక్ కార్, ఈసీఈ రాడార్ ప్రాజెక్ట్, ఎలక్ట్రికల్ సోలార్ ప్రాజెక్టులు, కంప్యూటర్ సైన్స్ విభాగం ఏఐ, సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి.

కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులు సమాజంపై బాధ్యతతో ఆవిష్కరణలు చేయాలని సూచించారు. బీటెక్, ఎంబీఏ, డిప్లొమా విద్యార్థులు ప్రాజెక్ట్ ఎక్సపో, పోస్టర్ ప్రెజెంటేషన్, క్విజ్, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచారని తెలిపారు.

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. సాయి గీతిక సాంకేతిక నైపుణ్యాల ప్రాధాన్యతను వివరించగా, డైరెక్టర్ విద్య కార్యక్రమాల విశేషాలను వివరించారు. రేపు నిర్వహించే ‘కలర్స్ ఆఫ్ సెలబ్రేషన్’లో ప్రముఖ గాయకుడు హేమచందర్ లైవ్ మ్యూజిక్ ప్రదర్శన ఇస్తారని తెలిపారు.

డైరెక్టర్ డా. రావు తేజ్ విద్యార్థులు మంచి అలవాట్లు అలవరచుకోవాలని సూచించగా, ప్రిన్సిపాల్ డా. లక్ష్మీనారాయణ విద్యతో పాటు సామాజిక బాధ్యతను గుర్తించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ డా. సుదర్శన్, ఏఓ వైశాలి, ట్రైనింగ్ & ప్లేస్మెంట్ ఆఫీసర్ రాజేష్, డిప్లొమా ఇంచార్జ్ కృష్ణప్రసాద్, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల ఆవిష్కరణలకు వేదికగా ‘శ్రీ చైతన్యోత్సవ్–2026’

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News