Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:45 AM

విద్యార్థులు వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకోవాలి ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్.

విద్యార్థులు వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకోవాలి ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్.

విద్యార్థులు వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకోవాలి ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్.
February 11, 2026 04:30 AM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

విద్యార్థులు వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకోవాలి ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్.

ప్రకృతి,వైజ్ఞానికతమరియురాజ్యాంగాన్నిపరిరక్షించుకోవాలనినినాదంతో, విజ్ఞాన దర్శిని సంస్థ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా సాగుతున్న ప్రకృతి విజ్ఞాన యాత్ర నేడు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి చేరుకుంది. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎం జి యు సెమినార్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఉప కులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్,  ప్రకృతి కవి ఉద్యమకారుడు జయరాజ్, విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి హేతుబద్ధత వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం,లోతైన పరిశీలన, సామాజిక అన్వయింపు ద్వారా శాస్త్రజ్ఞులుగా రూపొంది దేశ సేవ చేయవచ్చన్నారు. అనంతరం కవి, వాగ్గేకారుడు, ఉద్యమకారులు జయరాజ్ మాట్లాడుతూ మానవాళి మనుగడ ప్రకృతితో మమేకమై సయోధ్యతో మెలిగినప్పుడే సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ ప్రకృతి స్పృహ కలిగి ప్రకృతి అనుకూలమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి అన్నారు. కృతజ్ఞతా పూర్వకంగా జీవించడం, మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించినప్పుడే ప్రకృతి సమతుల్య సాధ్యమవుతుందన్నారు.రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, హక్కులతో పాటు బాధ్యతలను సైతం ప్రతి పౌరుడు గుర్తెరిగి ప్రవర్తించాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు అధ్యాపకులతో ప్రకృతి- రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు రమేష్ మాట్లాడుతూ మానవ మనుగడ వైజ్ఞానిక ఆవిష్కరణలపై ఆధారపడి ఉందన్నారు. అనేక సవాళ్లను సైన్స్ పరిష్కారాలు చూపి మానవ మనుగడ సుగమం చేసిన ఉదంతాలను ఆయన విద్యార్థులకు వివరించారు. మహనీయుల త్యాగ ఫలాలను రాబోవు తరాలకు బాధ్యతగా అందించాల్సిన గురుతర బాధ్యత విశ్వవిద్యాలయాలపై అన్నారు. ప్రతి విద్యార్థి జాతీయ భావాలతో, స్వలాభాలను వదిలి సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యే అవకాశాలు ఎన్ఎస్ఎస్ ద్వారా సాధ్యమని, ఈ కార్యక్రమాల్లో ప్రతి విద్యార్థి పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ గంజి ఈశ్వర లింగం నేత్రదానం మరియు రక్తదానం ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన దర్శని రాష్ట్ర ప్రతినిధి సురేష్ కుమార్, స్వరాజ్యం, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా మారం వెంకటరమణారెడ్డి, డా జక్క సురేష్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డా షరీఫ్, డా కిరణ్ మై, రమేష్ నాయక్, తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News