Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:09 PM

ఏడు వారాల జాతరలో ఐదోవ ఆదివారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పూజలు

24-05-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధి బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఏడు వారాల జాతర ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఐదోవ ఆదివారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించగా, తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. ఆలయ అర్చకులు సిద్దు స్వామి, నాగేష్ స్వామి అమ్మవారికి పంచామృతాలు, గంగాజలంతో మహాభిషేకం చేసి ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం పసుపు–కుంకుమ తిలకం దిద్ది పట్టువస్త్రాలు సమర్పించి సుగంధ పుష్పాలతో అమ్మవారిని అందంగా అలంకరించారు. హారతులు సమర్పించి నైవేద్యాలు నివేదించగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు జాతరకు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు బోనాలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఏడు వారాల జాతరలో ఐదోవ ఆదివారం ప్రత్యేక ప్రాధాన్యం కలిగినదని, జిల్లాలో ప్రసిద్ధి చెందిన శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటిగా గుర్తింపు పొందిందని తెలిపారు. భక్తితో మొక్కులు పెట్టిన వారి కోరికలు నెరవేరుతాయనే విశ్వాసంతో ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని పేర్కొన్నారు.

Sthanikam

ఏడు వారాల జాతరలో ఐదోవ ఆదివారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పూజలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News