Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:04 AM

ఏండ్లు గడచినా బాధిత కుటుంబాలకు అందని ఎక్సిగ్రేషియా

22-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చేనేతకు నిరాశే మిగిల్చిన రాష్ట్ర బడ్జెట్ – రూ. 2000 కోట్లు కేటాయించాలని డిమాండ్

చేనేత పరిశ్రమ పరిరక్షణకు, ప్రభుత్వ హామీల అమలుకు రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం రూ. 2000 కోట్లు కేటాయించాలని చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం కేవలం రూ. 258 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందని ఆయన విమర్శించారు.

ఆదివారం మోత్కూర్ మండల కేంద్రంలో పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన తెలిపారు:

ప్రభుత్వం ప్రకటించిన చేనేత రుణమాఫీ, నేతన్న భరోసా వంటి పథకాలు దాదాపు సంవత్సరం నర గడిచినా నిధుల లేమితో ఇప్పటికీ అమలు కాలేదన్నారు. త్రిఫ్ట్ (THRIFT) నేతన్న పొదుపు పథకంలో కార్మికులు ప్రతినెల RD-1లో డబ్బులు జమ చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం జమ చేయాల్సిన RD-2 భాగం గత పది నెలలుగా పెండింగ్‌లో ఉందని తెలిపారు.

అలాగే కొత్త పెన్షన్ల కోసం నేతన్నలు ఏండ్లుగా ఎదురుచూస్తున్నారని, చేనేత కార్మికుడు మరణించినప్పుడు ఇవ్వాల్సిన ఎక్సిగ్రేషియా కూడా సంవత్సరాలు గడిచినా బాధిత కుటుంబాలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

చేనేత పరిశ్రమను కాపాడాలంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 2000 కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం రూ. 258 కోట్లు కేటాయించడం సరైన నిర్ణయం కాదని విమర్శించారు

Sthanikam

ఏండ్లు గడచినా బాధిత కుటుంబాలకు అందని ఎక్సిగ్రేషియా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News