Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:05 AM

ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: మెడికల్ ఆఫీసర్ బి నాగమణి

28-04-2026 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి మండల కేంద్రంలో శనివారం మెడికల్ ఆఫీసర్ బి నాగమణి మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు వడదెబ్బల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పనులకు వెళ్లే కార్మికులు తలపై రుమాలు, గమ్ఛా లేదా చున్నీ కప్పుకొని వెళ్లాలని, వీలైనంత త్వరగా పనులు ముగించుకొని ఉదయం 11 గంటలలోపు ఇంటికి చేరుకోవాలని కోరారు. పనిచేసే సమయంలో అధిక చెమటలు పట్టడం, తల తిరగడం, జ్వరం వచ్చినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే విశ్రాంతి తీసుకొని తడి బట్టతో శరీరాన్ని చల్లబరచుకోవాలని తెలిపారు. వేసవి సెలవుల సందర్భంగా పిల్లలను అవసరం లేకుండా ఎండలోకి పంపవద్దని, బయటకు వెళ్లాల్సి వస్తే తలపై రుమాలు లేదా టోపీ పెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు. గ్రామాల్లో ఆశా వర్కర్ల ద్వారా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొంటూ, రోజుకు కనీసం ఐదు లీటర్ల వరకు నీరు తీసుకోవడం మంచిదని చెప్పారు. ఎండల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని మెడికల్ ఆఫీసర్ బి నాగమణి కోరారు.

Sthanikam

ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: మెడికల్ ఆఫీసర్ బి నాగమణి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News