Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:58 AM

ఈద్గా వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలి

ఈద్గా వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలి

ఈద్గా వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలి
11-03-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పరిశుభ్రత, తాగునీటి ఏర్పాట్లు తప్పనిసరి

సూర్యాపేట: ఈ నెల 21న జరగనున్న రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గా వద్ద అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని మునిసిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి, ఉపాధ్యక్షుడు షఫీ ఉల్లా అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని భాషా నాయక తండాలో ఉన్న ఈద్గాను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ పండుగ రోజు వేలాదిమంది ముస్లిం సోదరులు ఈద్గాకు చేరుకుని ప్రార్థనలు చేసే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈద్గా మైదానంలో చెత్తాచెదారం లేకుండా పూర్తిగా శుభ్రం చేయాలని, పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ప్రార్థనకు వచ్చే ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు.

పండుగ రోజున తాగునీటి సౌకర్యం కల్పించాలని, పట్టణంలోని అన్ని మసీదుల వద్ద కూడా పారిశుధ్య పనులు చేపట్టాలని తెలిపారు. విద్యుత్ బల్బులు లేని చోట బల్బులు ఏర్పాటు చేసి, మసీదుల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సండ్రపాటి విజయ్ కుమార్, రాపర్తి శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ అలీ, కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాధి, డి ఈ సత్య రావు, పారిశుధ్య పరిశీలకుడు సారగండ్ల శ్రీనివాస్, 13వ వార్డు కాంగ్రెస్ నాయకులు భూక్యా మహేష్, రమేష్, ఉప్పలయ్య, రసూల్, చాంద్ పాషా, రఫీ, చౌకత్ అలీ, బిక్షం, సాయి, జవాన్ రఫీ, వార్డు అధికారి నరేష్, జానయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఈద్గా వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News