మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంతో రేషన్ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడే తీసుకోకపోతే మళ్లీ మూడు నెలల వరకు అందుబాటులో ఉండదన్న భావనతో ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. దీంతో ఉదయం నుంచే రేషన్ దుకాణాల వద్ద పొడవైన క్యూలైన్లు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా సర్వర్ సమస్యలు తలెత్తడం, ఈపోస్ యంత్రాలు పనిచేయకపోవడం, కొంతమంది దుకాణాల్లో నిల్వలు తగ్గిపోవడం వంటి కారణాలతో పలువురికి ఇంకా రేషన్ అందలేదు. ఈ పరిస్థితులపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ సరఫరా కొనసాగుతుందని తెలిపారు. అందరికీ క్రమంగా బియ్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.
PRINT TIME: September 21, 2026 01:57 AM
ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ
ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ
13-04-2026
178 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంతో రేషన్ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడే తీసుకోకపోతే మళ్లీ మూడు నెలల వరకు అందుబాటులో ఉండదన్న భావనతో ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. దీంతో ఉదయం నుంచే రేషన్ దుకాణాల వద్ద పొడవైన క్యూలైన్లు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా సర్వర్ సమస్యలు తలెత్తడం, ఈపోస్ యంత్రాలు పనిచేయకపోవడం, కొంతమంది దుకాణాల్లో నిల్వలు తగ్గిపోవడం వంటి కారణాలతో పలువురికి ఇంకా రేషన్ అందలేదు. ఈ పరిస్థితులపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ సరఫరా కొనసాగుతుందని తెలిపారు. అందరికీ క్రమంగా బియ్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి