Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:41 PM

దొంగల సంచారం పెరుగుతోంది… ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎస్సై చైతన్య కిరణ్ హెచ్చరిక

03-04-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాయికోడ్ మండల కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్సై చైతన్య కిరణ్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో, రాయికోడ్ మండలంలోని సమస్త గ్రామ ప్రజలకు ముఖ్య సూచనలు తెలియజేశారు. ఇటీవలి కాలంలో పరిసర ప్రాంతాల్లో దొంగలు సంచరిస్తున్నట్లు సమాచారం అందగా, సమీపంలోని ఝరాసంఘం మండలంలో తాజాగా దొంగతనం జరిగిన ఘటన నమోదైనట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయంలో ఇళ్ల తలుపులు, కిటికీలు బిగించి వేసుకోవాలి, అపరిచిత వ్యక్తులు గ్రామంలో తిరిగితే వెంటనే గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వాలి, గ్రామంలోకి వచ్చే అనుమానాస్పద వాహనాల నంబర్లు నమోదు చేసుకోవాలి, బంగారం, నగదు వంటి విలువైన వస్తువులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలి, రాత్రివేళ అనవసరంగా బయట తిరగకూడదు. అదనంగా గ్రామాల్లో వాచ్‌మెన్ లేదా కాపలాదారులను నియమించి పహారా ఏర్పాటు చేయాలని, గ్రామ యువత కలిసి రాత్రిపూట పహారా నిర్వహించాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే 100 నంబర్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని, ముఖ్యంగా ఒంటరిగా ఉన్న ఇళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రజల సహకారంతోనే దొంగతనాలను అరికట్టగలమని పేర్కొంటూ, అందరూ అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు. గ్రామ సర్పంచ్‌లు ఈ సమాచారాన్ని తమ గ్రామ గ్రూపుల్లో షేర్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

దొంగల సంచారం పెరుగుతోంది… ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎస్సై చైతన్య కిరణ్ హెచ్చరిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News