Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 12:27 PM

దండు మైసమ్మ ఆలయంలో హుండీ చోరీ

దండు మైసమ్మ ఆలయంలో హుండీ చోరీ

దండు మైసమ్మ ఆలయంలో హుండీ చోరీ
03-02-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

దండు గ్రామ శివారులోని ప్రసిద్ధ మైసమ్మ ఆలయంలో శనివారం రాత్రి దుండగులు హుండీ చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఉన్న హుండీని ఎత్తుకెళ్లిన వారు, గుడి వెనుక ఉన్న పొలంలో హుండీని పగులగొట్టి అందులో ఉన్న నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు.ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు హుండీ కనిపించకపోవడంతో ఆలయ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన నిర్వాహకులు, గుడి వెనుక పొలంలో పగులగొట్టిన హుండీని గుర్తించారు. భక్తుల విరాళాల రూపంలో వచ్చిన నగదు, ఆభరణాలు మొత్తం దుండగులు తీసుకెళ్లినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని

పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. దుండగులను త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Sthanikam

దండు మైసమ్మ ఆలయంలో హుండీ చోరీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News