Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:21 PM

డంపింగ్ యార్డు పొగతో ఉక్కిరిబిక్కిరి చర్యలు తీసుకోకపోతే కోర్టుకెళ్తాం: నూర్ అహ్మద్

20-05-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, ఆదోని పట్టణంలోని శిరుగుప్ప రోడ్డు చెక్‌పోస్టు సమీపంలో ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డులో వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో భారీగా పొగ వెలువడుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు, సమీప గ్రామాల ప్రజల విజ్ఞప్తి మేరకు ఆయన బుధవారం డంపింగ్ యార్డును సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.

డంపింగ్ యార్డులో వ్యర్థాల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సిన మున్సిపాలిటీ అధికారులు వ్యర్థాలకు నిప్పు పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని మండిపడ్డారు.

డంపింగ్ యార్డులో మంటలను వెంటనే ఆర్పి పొగను అదుపులోకి తీసుకురాకపోతే ప్రజల ప్రాణ రక్షణ కోసం ఆదోని మున్సిపాలిటీ అధికారులపై కోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు. సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సలహాదారు నరేంద్ర యాదవ్, షకీల్, స్థానిక వ్యాపారులు, రాయనగర్, కొట్టాలు, మదిరె, ఇస్వీ, సంతెకుడ్లూరు, కడితోట, పర్వతాపురం గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

డంపింగ్ యార్డు పొగతో ఉక్కిరిబిక్కిరి చర్యలు తీసుకోకపోతే కోర్టుకెళ్తాం: నూర్ అహ్మద్

Article Image

ఆదోని, ఆదోని పట్టణంలోని శిరుగుప్ప రోడ్డు చెక్‌పోస్టు సమీపంలో ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డులో వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో భారీగా పొగ వెలువడుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు, సమీప గ్రామాల ప్రజల విజ్ఞప్తి మేరకు ఆయన బుధవారం డంపింగ్ యార్డును సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.

డంపింగ్ యార్డులో వ్యర్థాల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సిన మున్సిపాలిటీ అధికారులు వ్యర్థాలకు నిప్పు పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని మండిపడ్డారు.

డంపింగ్ యార్డులో మంటలను వెంటనే ఆర్పి పొగను అదుపులోకి తీసుకురాకపోతే ప్రజల ప్రాణ రక్షణ కోసం ఆదోని మున్సిపాలిటీ అధికారులపై కోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు. సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సలహాదారు నరేంద్ర యాదవ్, షకీల్, స్థానిక వ్యాపారులు, రాయనగర్, కొట్టాలు, మదిరె, ఇస్వీ, సంతెకుడ్లూరు, కడితోట, పర్వతాపురం గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News