Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:19 PM

దివ్యాంగుల సమస్యలపై మంత్రి పొన్నంకు వినతి. హామీల అమలు, ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి

21-05-2026 115 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం సభ్యులు కలిసి దివ్యాంగుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు రవాణా, బీసీ సంక్షేమ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. విద్య, ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాలను త్వరితగతిన అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు.

దివ్యాంగుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి చైర్మన్ చెరుకు నాగభూషణం, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్, ఉపాధ్యక్షుడు డాక్టర్ కుర్షీద్ మియా, మారవేణి చంద్రశేఖర్ యాదవ్, సహాయ కార్యదర్శి నాగేష్, చిత్తలూరి వేణు గౌడ్, దూరపల్లి దానమ్మ, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దివ్యాంగుల సమస్యలపై మంత్రి పొన్నంకు వినతి. హామీల అమలు, ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి

Article Image

బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం సభ్యులు కలిసి దివ్యాంగుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు రవాణా, బీసీ సంక్షేమ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. విద్య, ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాలను త్వరితగతిన అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు.

దివ్యాంగుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి చైర్మన్ చెరుకు నాగభూషణం, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్, ఉపాధ్యక్షుడు డాక్టర్ కుర్షీద్ మియా, మారవేణి చంద్రశేఖర్ యాదవ్, సహాయ కార్యదర్శి నాగేష్, చిత్తలూరి వేణు గౌడ్, దూరపల్లి దానమ్మ, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News