Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:34 AM

జిల్లాలో గోదాముల విస్తరణకు చర్యలు.

జిల్లాలో గోదాముల విస్తరణకు చర్యలు.

జిల్లాలో గోదాముల విస్తరణకు చర్యలు.
18-03-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

40 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కొత్త నిర్మాణాలు – జనఔషధ కేంద్రాల ఏర్పాటుకూ నిర్ణయం

యాదాద్రి భువనగిరి,

జిల్లాలో గోదాముల సదుపాయాన్ని పెంచేందుకు జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయాలు తీసుకుంది. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

జిల్లాలో ప్రస్తుతం గోదాముల సౌకర్యం తగినంతగా లేకపోవడంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త గోదాముల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ‘వరల్డ్ లార్జెస్ట్ గ్రీన్ స్టోరేజ్ స్కీమ్’ కింద సహకార సంఘాల ద్వారా ఈ గోదాములను నిర్మించనున్నారు. ఇందుకు నాబార్డు ఆర్థిక సహాయం అందించనుంది.

రైలు, రోడ్డు మార్గాలకు సమీపంలో భూమి అందుబాటులో ఉన్న మూడు సహకార సంఘాలను గుర్తించి అక్కడ గోదాముల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలో సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం పెరుగనుంది.

అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరలకు మందులు అందుబాటులో ఉండేలా PACS‌లలో జన ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నట్లు జిల్లా సహకార అధికారి మురళి రమణ తెలిపారు.

Sthanikam

జిల్లాలో గోదాముల విస్తరణకు చర్యలు.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News