Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 10:36 PM

జిల్లాలో ఆదర్శ అంగన్వాడి కేంద్రాలు ఏర్పాటు చేయాలి

17-02-2026 228 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పోషకాహార లోపం ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశాలు

జిల్లాలో ఆదర్శ అంగన్వాడి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువులను క్రమం తప్పకుండా పరిశీలించి పోషకాహార లోపం ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు నూతన ప్రీ స్కూల్ పాఠ్య ప్రణాళిక ప్రకారం బోధన నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, కేంద్రాలను సమయానికి ప్రారంభించి పోషణ పర్యవేక్షణ పద్ధతి ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

వయోవృద్ధుల పోషణ కేసులు, సమస్యలను వేగంగా పరిష్కరించాలని, మహిళలపై ఎలాంటి అకృత్యాలు జరగకుండా చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లా శిశు సంరక్షణ, మహిళా సంక్షేమం, వయోవృద్ధుల సంక్షేమంపై చేపట్టవలసిన చర్యలపై సమగ్రంగా సమీక్షించారు. అంగన్వాడి కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి కే. నరసింహరావు, సూపరిండెంట్ జి. హుస్సేన్, జిల్లా శిశు సంరక్షణ అధికారి రవి కుమార్, అటవీ పరిధి అధికారి బి. వినోద్ కుమార్, సంకల్ప జిల్లా సమన్వయకర్త చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జిల్లాలో ఆదర్శ అంగన్వాడి కేంద్రాలు ఏర్పాటు చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News