Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:36 AM

ధర్నాతో దద్దరిల్లిన రామన్నపేట… 25 నిమిషాల ట్రాఫిక్ జామ్

18-03-2026 243 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: వంద పడకల ఆస్పత్రి సాధన కోసం సాగుతున్న ఉద్యమం భాగంగా సుభాష్ సెంటర్ వద్ద సిపిఎం నాయకులు చేపట్టిన ధర్నా రామన్నపేటలో ఉద్రిక్తతకు దారి తీసింది. సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో సుమారు 25 నిమిషాల పాటు ట్రాఫిక్ పూర్తిగా స్థంభించింది. ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దీక్షలు మూడో రోజుకు చేరుకున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన నాయకులు, హామీ వచ్చే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ఈ ధర్నాతో ఉద్యమం మరింత ఉధృతమైంది.

సమాచారం అందుకున్న సీఐ ఎన్. వెంకటేశ్వర్లు, ఎస్ఐ డి. నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిరసనకారులతో మాట్లాడి రోడ్డును ఖాళీ చేయించడంతో ట్రాఫిక్ క్రమంగా పునరుద్ధరించబడింది.

అనంతరం నిరసనకారులు తిరిగి దీక్షా శిబిరానికి చేరుకుని తమ ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం మరింత వేగం పుంజుకుంది.

Sthanikam

ధర్నాతో దద్దరిల్లిన రామన్నపేట… 25 నిమిషాల ట్రాఫిక్ జామ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News