Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:18 PM

ధాన్యం తరలింపుపై అధికారుల సమీక్ష. రైతులకు ఇబ్బందులు కలగనివ్వొద్దు: కాంగ్రెస్ నేతలు

27-05-2026 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో వరి ఎగుమతులు, ధాన్యం కొనుగోళ్లపై జిల్లా జాయింట్ రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకరెడ్డి, ఆర్డీవో శేఖర్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు.

అకాల వర్షాల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారని, ధాన్యం తడిసి నష్టపోకుండా వెంటనే లారీలు ఏర్పాటు చేసి ఎగుమతులను వేగవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులను కోరారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ధాన్యం తరలింపులో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లాల్‌బహుదూర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షం రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గంగుల రాజిరెడ్డి, గుత్త నరసింహారెడ్డి, రైతు సంఘం నాయకులు మేక అశోక్ రెడ్డి, నాయకులు గోదాసు శ్రీమన్నారాయణ, ఎండి జెమురుద్దీన్ , కడ మంచి మధుసూదన్ తదిరులు పాల్గొన్నారు.

Sthanikam

ధాన్యం తరలింపుపై అధికారుల సమీక్ష. రైతులకు ఇబ్బందులు కలగనివ్వొద్దు: కాంగ్రెస్ నేతలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News