Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:57 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయాలి: జిల్లా కలెక్టర్

01-05-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అడిషనల్ కలెక్టర్ మాధురితో కలిసి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించిన ఆయన, జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు, ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం పరిమాణం, ట్యాబ్ ఎంట్రీలు, కేంద్రాల్లో కల్పించిన సౌకర్యాలు, గన్ని బ్యాగుల లభ్యత, తేమ కొలిచే యంత్రాలు, రైతుల ఖాతాల్లో జమ అయిన చెల్లింపుల వివరాలను సమీక్షించారు. జిల్లాలో ప్యాక్స్, డీసీఎంఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో మొత్తం 175 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించగా, అన్ని కేంద్రాలను వెంటనే పూర్తిస్థాయిలో ప్రారంభించి రైతులు ధాన్యం తీసుకొచ్చిన వెంటనే కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగునీరు, నీడ, కూర్చునే వసతి వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, గన్ని సంచులు, తేమ కొలిచే యంత్రాలు అందుబాటులో ఉంచాలని, ధాన్యం కొనుగోలు అనంతరం రైతుల ఖాతాల్లో చెల్లింపులు సకాలంలో జమ అయ్యేలా చూడాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయాలి: జిల్లా కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News