Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:24 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
April 11, 2026 04:28 PM 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రైతులకు మద్దతుగా ప్రత్యేక ప్రోత్సాహాలు – కొప్పుల వేణారెడ్డి

సూర్యాపేట: మండలంలోని ఇమాంపేట్ గ్రామంలో ఇందిరా క్రాంతి పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు.

ఇమాంపేట్ సంఘబంధం ఒకటి, రెండు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల ద్వారా రైతులు తమ పంటను సులభంగా విక్రయించుకోవచ్చని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు క్వింటాకు ఐదు వందల రూపాయల ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందిస్తున్నట్లు గుర్తు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్, రుణ మాఫీ, రైతు భరోసా వంటి పథకాలతో పాటు ఈ ప్రోత్సాహకం అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు.

తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తూ రైతులకు న్యాయం చేస్తున్నదని తెలిపారు. రైతుల వద్దే ధాన్యం కొనుగోలు చేసి తిరిగి ప్రజలకు అందించే విధానం అమలు చేస్తున్నామని చెప్పారు.

అందువల్ల రైతులు తప్పనిసరిగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్రాల వద్ద కప్పే సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు. తేమ పదిహేడు శాతం ఉండేలా చూడాలని, బస్తా నలభై ఒక కిలోలకే తూకం వేయాలని, రైతులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరిగే నాగేశ్వరి నాగరాజు, ఉప సర్పంచ్ చింత చైతన్య సతీష్, మాజీ సర్పంచ్ పాముల ఉపేందర్, నకిరేకంటి బాలకృష్ణ, అబ్దుల్ కరీం, మునగాల జ్యోతి సాలయ్య, రేగురి హరీష్, నకిరేకంటి మాధవి సురేందర్, నాశబోయిన స్వాతి రవి, నకిరేకంటి మానస సతీష్, బైరు శైలేందర్ గౌడ్, బైరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News