Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:19 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు వేగవంతం చేయాలి

24-05-2026 175 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి, సిరిపురం, రామన్నపేట పట్టణం, దుబ్బాక, మునిపంపుల, ఎన్నారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, తూకం ప్రక్రియ, రైతులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా వెంట వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, నీడ, తార్పాలిన్‌లు తదితర మౌలిక సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Sthanikam

ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు వేగవంతం చేయాలి

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి, సిరిపురం, రామన్నపేట పట్టణం, దుబ్బాక, మునిపంపుల, ఎన్నారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, తూకం ప్రక్రియ, రైతులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా వెంట వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, నీడ, తార్పాలిన్‌లు తదితర మౌలిక సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News